కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం

[ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం ]
. _102405608_board
>> గత రెండు పోస్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపంతో బాటు అంచనా వ్యయం, రిజర్వాయర్లు, ముంపు వివరాలను తెలుసుకున్నాం. . 

… ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసే విధానం తెలుసుకొందాం. 

>> తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు. గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే వీటి ప్రవాహాన్ని ఆపడానికి బ్యారేజీలు కట్టి, మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాలి. దీన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్(ఎత్తిపోత‌లు) అంటారు. న‌ది నుంచి నీరు కాలువ‌లోకి రావ‌డం, అక్క‌డి నుంచి సొరంగం ద్వారా ప్ర‌యాణించడం. అక్క‌డ భూమిలోప‌ల ఉన్న పంపుల‌ నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్క‌డ జ‌రిగే ప్ర‌క్రియ‌. 

>> నీటిని లిఫ్ట్ చేయడానికి వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తోడుకోవేవిధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. 2 టీఎంసీల నీటిని తోడడానికి సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం.

>> కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 7 లింకులుగా విభజించారు. ఒక్కొక్క లింకు ద్వారా ఒక్కొక్క ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నీటిని ఆయా జలాశయాలకు(రిజర్వాయర్లు) తరలిస్తూ అక్కడినుండి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని తరలించడం చేస్తారు. ఈ 7 లింకుల ద్వారా నీటి తరలింపు ఇలా ఉంటుంది. 

[లింక్-1 : మేడిగడ్డ బ్యారేజి నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు]

=> లింక్ మొత్తం పొడవు : 46.30 కిలోమీటర్లు
=> ఆయకట్టు విస్తీర్ణం : 30 వేల ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 33. 18 టీఎంసీలు
=> మొత్తం బ్యారేజీలు : 3 (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల)
=> మొత్తం పంపు హౌజులు : 3 (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల)
=> గ్రావిటీ కెనాల్ పొడవు : 21.17 కిలోమీటర్లు

>> లింక్-1 ద్వారా, మొత్తం మూడు బ్యారేజీలనుండి (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మూడు లిఫ్టుల్లో భారీ పంపుల సహాయంతో మొత్తం 33 టీఎంసీలకు పైగా నీటిని తోడుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ కు పంపుతారు. 

>> గోదావరి నది ప్రవాహంలో అన్నిటికంటే ముందు(ఎగువ భాగాన) ఎల్లంపల్లి రిజర్వాయర్ – తరవాత సుందిళ్ల బ్యారేజు – దాని తరవాత – అన్నారం బ్యారేజు – చివరగా మేడిగడ్డ బ్యారేజులు (అన్నిటికంటే దిగువన) ఉంటాయి. అంటే నదీప్రవాహంనుండి భారీ పంపుల ద్వారా తోడుకొన్న ఈ నీటిని గోదావరి నది ప్రవాహానికి వ్యతిరేకదిశలో దిగువభాగం నుండి ఎగువకు పంపిస్తారు. 

>> మేడిగడ్డ బ్యారేజు నుండి పంపులద్వారా తోడిన నీరు సుమారు 15 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి ఎగువనున్న అన్నారం బ్యారేజీలోనికి చేరుతుంది. ఆ నీటిని అన్నారం నుండి పంపులతో తోడి, వాటిని మళ్ళీ ఇంకొంచెం ఎగువభాగాన ఉన్న సుందిళ్ల బ్యారేజీలోని పంపుతారు. సుందిళ్ల బ్యారేజీలో నిలువచేసిన నీటిని అక్కడి పంపులద్వారా తోడి, వాటిని చివరగా మరింత ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి నింపుతారు. 

>> అంటే, మేడిగడ్డ నుండి – అన్నారం – సుందిళ్ల – బ్యారేజీలద్వారా నదీప్రవాహానికి వ్యతిరేకదిశలో పంపులతో తోడుకొంటూ చివరికి ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నీటిని నింపుతారు – ఇదీ స్థూలంగా లింక్-1 లో జరిగే పని. దీనిద్వారా సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-2 : ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకు]

=> లింక్ మొత్తం పొడవు : 65.63 కిలోమీటర్లు (సొరంగాలు-49 కిలోమీటర్లు, కాలువలు-12 కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : లేదు
=> నీటి నిల్వ సామర్థ్యం : 0.78 టీఎంసీలు (మేడారం రిజర్వాయర్)
=> మొత్తం పంపు హౌజులు : 2 

>> లింక్-2 ద్వారా ఎటువంటి ఆయకట్టుకూ నీరు అందదు. అయితే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మేడారం రిజర్వాయర్లో సుమారు 0.78టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-2 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. 

[లింక్-3 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్వాయర్ వరకు]

=> లింక్ మొత్తం పొడవు : 45.48 కిలోమీటర్లు (సొరంగాలు-12 కిలోమీటర్లు, కాలువలు-27.5 కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : 86150 ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 3 టీఎంసీలు (మలక్ పేట్ రిజర్వాయర్)
=> మొత్తం పంపు హౌజులు : 2 

>> లింక్-3 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్యాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మలక్ పేట రిజర్వాయర్లో సుమారు 3 టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-3 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 86 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-4 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు]

=> లింక్ మొత్తం పొడవు : 446.22 కిలోమీటర్లు (సొరంగాలు-41 కిలోమీటర్లు, కాలువలు-394 కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : 5 లక్షల 89 వేల 280 ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 71.5 టీఎంసీలు (4 రిజర్వాయర్లు – కొండపోచమ్మ, అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు)
=> మొత్తం పంపు హౌజులు : 4

>> లింక్-4 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-4 లో నీటిని తరలించడానికి నాలుగు చోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 5 లక్షల 89 వేల 280 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-5 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి చిట్యాల వరకు]
.
=> లింక్ మొత్తం పొడవు : 208.65 కిలోమీటర్లు (సొరంగాలు-1.5 కిలోమీటర్లు, కాలువలు-207 కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : 2 లక్షల 51 వేల 800 ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 21.26 టీఎంసీలు (2 రిజర్వాయర్లు – గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు)
=> పంపు హౌజులు : లేవు

>> లింక్-5 ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ములకలపల్లి(చిట్యాల మండలం) వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-5 లో నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడరు. నీళ్లన్నీ గ్రావిటీ కెనాల్ ద్వారానే క్రిందికి ప్రవహిస్తాయి. దీనిద్వారా సుమారు 2 లక్షల 51 వేల 800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-6 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు వరకు]

=> లింక్ మొత్తం పొడవు : 625 కిలోమీటర్లు (సొరంగాలు-22 కిలోమీటర్లు, కాలువలు-581 కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : 3 లక్షల 29 వేల 42 ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 21.26 టీఎంసీలు (2 రిజర్వాయర్లు – గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు)
=> పంపు హౌజులు : లేవు

>> లింక్-6 ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు రిజర్వాయర్ వరకూ సుమారు 625 కిలోమీటర్లమేర 3 లక్షల 30వేల ఆయకట్టుకు నీరు అందుతుంది. నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడడంలేదు. పూర్తిగా గ్రావిటీ ద్వారానే నీటిని తరలిస్తారు. 

[లింక్-7 : శ్రీరామ్ సాగర్ నుండి మూడు డిస్ట్రిబ్యూషన్లు ]

=> లింక్ మొత్తం పొడవు : 395 కిలోమీటర్లు (సొరంగాలు-56 కిలోమీటర్లు, కాలువలు-287కిలోమీటర్లు) 
=> ఆయకట్టు విస్తీర్ణం : 5 లక్షల 39 వేల 428 ఎకరాలు
=> నీటి నిల్వ సామర్థ్యం : 26 టీఎంసీలు (9 రిజర్వాయర్లు)
=> పంపు హౌజులు : 7

>> లింక్-7 ద్వారా శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుండి మూడువైపులకు నీటిని సరఫరా చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని సుమారు 5 లక్షల 39 వేల 428 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. మొత్తం 30 టీఎంసీల నీటిని 9 రిజర్వాయర్లద్వారా తరలించడానికి 7 పంపుహౌజులను ఏర్పాటుచేశారు. 
.
…… ఇదీ స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసే విధానం
.
>> ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తెలంగాణ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది. లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. 
.
….. ఈ వివరాలన్నీ తెలంగాణా ప్రభుత్వ నీటిపారుదలశాఖ వారివి. 

>> అయితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ తెలిపే వివరాలు నీటిపారుదలశాఖ వెబ్సైట్లో ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ముఖ్యమంత్రో, లేక మంత్రులో చెప్పే వివరాలనుబట్టి మాత్రమే మనకు ప్రస్తుతం పనులు ఎంతవరకూ వచ్చాయి అన్నది తెలుసుకొనే అవకాశం ఉంది. లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రాంతాలన్నీ వ్యక్తిగతంగా వెళ్లి చూసి తెలుసుకోవాల్సిందే. 
.
>> దాదాపు లక్షకోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ ను ప్రజలకు తెలియజేసే ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. – ప్రోగ్రెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే,లేకపోతే రాజకీయులు చెప్పే మాటలను నమ్మలేము.
.
… . రేపు అంటే జూన్ 21వ తెదీన ఏమి ప్రారంభనున్నారో చూడాలని ఆసక్తిగా ఉంది.
.

6 thoughts on “కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం

  1. Link-1 present status:

    The government is making preparations to lift two TMC (thousand million cubic feet) of Godavari water per day from the Medigadda barrage, beginning July end

    https://www.thenewsminute.com/article/telanganas-rs-80000-crore-kaleshwaram-irrigation-project-all-you-need-know-103972

    నేను రాసింది అందెశ్రీ రాసిన తెలంగాణా గీతంలో ఒక చరణం. జగన్ గెల్చినందుకు కొందరికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది పాపం!

    మెచ్చుకోండి

  2. How foolish jai gottimukkala is – He is writing poetry about future of telengana even after he read all these bare facts!

    Just the single fact :
    “ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తెలంగాణ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది. లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది.
    .
    ….. ఈ వివరాలన్నీ తెలంగాణా ప్రభుత్వ నీటిపారుదలశాఖ వారివి. ” is enough to open the eyes of verrievengalappa, and how ignorant he is still dreaming about getting godavari water!?

    Did he supported jagan for looting andhra with the help of a weak and pawn of telangana king and live a happy life on the corpse of andhra?

    మెచ్చుకోండి

  3. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులలో ఎన్ని ప్రారంభమయ్యాయి, ఎన్ని నిర్మాణదశలో వున్నాయి, ఎన్ని/ఏవైనా ప్రారంభించాల్సి వుందా వంటి వివరాలు సేకరించడానికి వెబ్సైట్లు, పత్రికలు తిరగేసినా కనిపించలేదు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎంత నిధులు ఖర్చయ్యాయి, ఎన్ని లింకులు పూర్తయ్యాయి వంటి వివరాలు పత్రికలు కూడా ప్రచురించకపోవడం ఆశ్చర్యంగా వుంది. కొంతమంది మిత్రులు ఆన్లైన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పూర్తయిందనే భ్రమల్లో కూడా వున్నారు. మీరన్నట్లు వెబ్సైటులో కనీస సమాచారం అయినా వుంటే బావుంటుంది. మీరు సేకరించిన సమాచారం నీటిపారుదల శాఖ నుండి సేకరించిందా లేక వెబ్సైట్లలోదా?

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  4. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె
    పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలె
    సుఖశాంతుల తెలంగాణా సుభిక్షంగ ఉండాలె
    స్వరాష్ట్రమైన తెలంగాణా స్వర్ణయుగం కావాలె

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

వ్యాఖ్యానించండి