హౌడీ మోడీ

ఈనెల 27వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించడానికి అమెరికా వెళుతున్న ప్రధాని మోడీ గారు కొన్నిరోజుల ముందుగానే అమెరికాకు చేరుకోనున్నారు. . 22వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో NRG స్టేడియం లో “Shared Dreames – Bright Futures” పేరిట అమెరికాలో ఉన్న భారతీయులు ఏర్పాటుచేయనున్న ఒక సమావేశంలో మోడీ పాల్గొంటారు. ఈసభకు సుమారు 50వేలమంది హాజరవుతున్నారు. బీరూ-బిరియానీ ఇచ్చి ఎమ్మెల్యే సభకు కూడా లక్షలాదిమందికి తరలిస్తున్న మనకు ఈ 50వేలమంది పెద్ద లెక్కలోనిది… Read More హౌడీ మోడీ

పట్టువదలని విక్రమార్కుడు “సుబ్రహ్మణ్యన్ స్వామి”

… 47 ఏళ్ల న్యాయపోరాటంలో విజయంసాధించిన ఘటికుడు మన సుబ్రహ్మణ్యన్ స్వామి. . బహుశా భారతదేశ న్యాయచరిత్రలోనే ఒక సుదీర్ఘమైన న్యాయపోరాటంగా చెప్పవచ్చు. 1972 లో తనను ఆకస్మికంగా తొలగించిన ఐఐటి- ఢిల్లీపై కేసువేసి 47 సంవత్సరాలపాటు న్యాయ పోరాటం చేసి విజయం సాధించాడు. తన జీతాన్ని 8% వడ్డీతోసహా కలిపి సుమారు 40 లక్షల రూపాయలకు పైగా పొందాడు. . అప్పటికే అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో బోధిస్తున్న స్వామిని 1969 లో “Delhi School of… Read More పట్టువదలని విక్రమార్కుడు “సుబ్రహ్మణ్యన్ స్వామి”

“మహమ్మదలీ జిన్నా” గారి ఇస్లామిక్ ఇండియా (కామన్వెల్త్ ఆఫ్ పాకిస్తాన్). 

Govt. of India Act, 1935 చట్టం ప్రకారం 1936-37లో ఇండియా ప్రావిన్షియల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో మొహమ్మద్ అలీ జిన్నా 482 ముస్లిం సీట్లలో మెజారిటీ సాధిస్తారని, ఆపై ఒక సంకీర్ణం కోసం కాంగ్రెస్ తో బేరం కుదుర్చుకోవాలని ఊహించారు. అయితే ఈయన పార్టీ కేవలం 109 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. జిన్నా కాంగ్రెస్ తో సంకీర్ణ ఏర్పాటుకు ప్రతిపాదించాడు, కాని కాంగ్రెస్ తిరస్కరించింది.  .  1936–37లో ఎన్నికలకు వెళ్ళిన 11 ప్రావిన్సులలో జిన్నా… Read More “మహమ్మదలీ జిన్నా” గారి ఇస్లామిక్ ఇండియా (కామన్వెల్త్ ఆఫ్ పాకిస్తాన్). 

“కాశ్మీర్”లో నడుస్తున్న మూడుదశాబ్దాల ఇస్లామిక్ ఉగ్రవాదం

రాత్రి పొద్దుపోయాక టెర్రరిస్టులు సర్వానందకౌల్ ప్రేమి ఇంటి తలుపు తట్టారు. లోపలివారు ప్రాణభయంతో గజగజ వణికారు. రోజులు బాగాలేవు. ఏతప్పూ చేయకపోయినా కాశ్మీరీ హిందువులను మిలిటెంట్లు క్రూరంగా వేటాడుతున్నారు. ‘ఇండియా ఏజంట్లయిన కాఫిర్లకు చావు తప్పదు’ అంటూ మసీదుల నుంచి స్పీకర్లలో బెదిరిస్తున్నారు. తక్షణం కాశ్మీర్ విడిచిపోకపోతే మీప్రాణాలు, ఆస్తులను ఎవరూ కాపాడలేరని ప్రతిచోటా పోస్టర్లు వేశారు. పలువురు హిందువులను కిరాతకంగా చిత్రహింసలు పెట్టి పట్టపగలు చంపేశారు. హడలిపోయిన హిందువులు చాలామంది అప్పటికే ఇల్లు వదలి సకుటుంబంగా… Read More “కాశ్మీర్”లో నడుస్తున్న మూడుదశాబ్దాల ఇస్లామిక్ ఉగ్రవాదం

కశ్మీర్ “ఇస్లామిక్ ఉగ్రవాదానికి ” ఏడువందల ఏళ్ళు. 

“కల్హణుడు” రచించిన 12వ శతాబ్దపు రచన “రాజతరంగిణి” – కశ్మీర్ చరిత్రకు ఎటువంటి అనుమానాలకూ తావివ్వనటువంటి సాధికార గ్రంధం.  .  రాజతరంగిణి ప్రకారం మనకుతెలిసిన కశ్మీర్ చరిత్ర దాదాపు ఐదున్నరవేల సంవత్సరాలనాటిది. క్రీస్తుకుపూర్వం 3450తో మొదలవుతుంది. ఈ ఐదున్నరవేల ఏళ్ళలో దాదాపు 4598 సంవత్సరాలపాటు సుమారు 134మంది హిందూరాజులు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. – ఈ హిందూ రాజుల పాలనను మరొక వ్యాసంలో వివరిస్తాను..  .  ప్రస్తుతవ్యాసంలో కశ్మీర్ ను రక్తసిక్తం చేసి, అసలైన కశ్మీర్ ఆత్మనే లేకుండా… Read More కశ్మీర్ “ఇస్లామిక్ ఉగ్రవాదానికి ” ఏడువందల ఏళ్ళు. 

రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

తమ ప్రభుత్వం రెండవసారి ఎన్నికైనతరవాత మొట్టమొదటగా జరిపిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ దేశంలోని రైతులకు అండగా నిలబడడానికి ఒక చారిత్రాత్మకైన నిర్ణయం తీసుకొన్నాం, ఎన్నికల వాగ్దానాన్ని అమలుపరుస్తున్నాం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంది మోడీ ప్రభుత్వం. “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” (PM-KISAN) అనబడే ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటంటే “To supplement the financial needs of the farmers in procuring various inputs to ensure proper crop… Read More రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

భాషాదండయాత్ర

>> “హిందీ మన జాతీయ భాష” అన్న భ్రమ మనలో చాలామందికి ఉంది.కారణాలేవైలా మెజారిటీ జనాలలో నేటికి అదే భావన నాటుకుపోయింది. దీనికి రాజకీయల తప్పుడు ప్రచారం కూడా ప్రధానకారణం.  > 2017 లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కొద్దికాలానికే “వెంకయ్య నాయుడు” చేసిన ఒక తప్పుడు ప్రకటన ఈకోవలోనిదే. 2017 జూన్ నెలలో నాయుడు గారు అన్నమాట ” హిందీ మన జాతీయ భాష. హిందీ లేకుండా మనం పురోగతిని సాధించడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ అందరూ ఇంగ్లీష్… Read More భాషాదండయాత్ర

చంద్రబాబు పతనం

నియంతృత్వం – స్వీయవినాశకరం.  >> పాలకులెవరైనా సరే, అలవిగాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి, అధికారం వచ్చాక వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అధికారం అండతో రెచ్చిపోయి, ప్రత్యుర్థులను నిర్మూలించి, ప్రత్యర్థి పార్టీలను, మిగతా జాతులను నాశనం చేసి, అపరిమితమైన అధికార కాంక్షతో తాను మాత్రమే అధికారంలో ఉండాలని, తన తరవాత తన సొంత జాతులు, వ్యక్తులు తప్ప ఎదుటిపక్షంవాళ్లకు పొరపాటున కూడా అధికారం రాకుండా ఉండాలంటూ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొంటూ పొతే, చివరికి వారికి ఘోరమైన… Read More చంద్రబాబు పతనం

హిందువుల మైండ్ రిగ్గింగ్

…. హిందువుల మైండ్ రిగ్గింగ్.! >> మొన్న ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్త ప్రభంజనం తరవాత ఎంఐఎం అధినేత “అసదుద్దీన్ ఒవైసీ” ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు.  .  “ఈ ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే. దేశంలో హిందూ ఓటుబ్యాంకు ఉందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ హిందూ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడంకోసమే అన్ని చర్యలూ తీసుకొంటున్నారు. ఈవీఎం లకు ఏమీ కాలేదు. హిందువుల మైండ్ లు రిగ్గింగ్ అయ్యాయి” .  >> అన్యాపదేశంగా అన్నాడో లేక తత్వం… Read More హిందువుల మైండ్ రిగ్గింగ్

శశికళ… “భస్మాసురహస్తం”

…… శశికళ… “భస్మాసురహస్తం”..!! . “Shut your mouth when you are in Deep Shit” అని ఒక సామెత ఉంది. అంటే, పరిస్థితులు మనకనుకూలంగా లేనప్పుడు ఒదిగి ఉండడం ఉత్తమం అనే అర్థంలో చెప్పుకోవచ్చు, . >> రాజకీయాల్లో, దూకుడుతో పాటు, సరైన వ్యూహం, ఎదుటివ్యక్తి రాజకీయంగా అత్యంత శక్తిమంతుడిగా ఉండి, వ్యవస్థలను ప్రభావితం చేయగలిగి ఉన్నప్పుడు సందర్భాన్ననుసరించి పట్టువిడుపులు కూడా అవశ్యం. అన్నిటికీమించి, “టైమింగ్” అన్నది చాలా ముఖ్యం. . >> జయలలత… Read More శశికళ… “భస్మాసురహస్తం”