రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

తమ ప్రభుత్వం రెండవసారి ఎన్నికైనతరవాత మొట్టమొదటగా జరిపిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ దేశంలోని రైతులకు అండగా నిలబడడానికి ఒక చారిత్రాత్మకైన నిర్ణయం తీసుకొన్నాం, ఎన్నికల వాగ్దానాన్ని అమలుపరుస్తున్నాం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంది మోడీ ప్రభుత్వం.

PM Kisan

“ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” (PM-KISAN) అనబడే ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటంటే “To supplement the financial needs of the farmers in procuring various inputs to ensure proper crop health and appropriate yields, commensurate with the anticipated farm income” – అంటే “ఈ దేశంలోని రైతన్నలు మంచి పంటలు పండించి తగిన పంటదిగుబడి పొంది, అనుకొన్న ఆదాయం పొందడానికి అనుగుణంగా అవసరమైన ఉత్పదకాలను సమకూర్చుకోవడానికీ వారు పెట్టే పెట్టుబడి మీద తగిన ఆర్ధిక సహాయం చేయడం”

>> ఈ పథకానికి దేశంలోని రెండెకరాలలోపు ఉన్న “భర్త – భార్య – మైనర్ సంతానం” ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు.  అంటే కుటుంబసభ్యులందరిపేరిటా ఉన్న భూమి మొత్తం కలిపినా రెండు హెక్టార్లు(సుమారు ఐదెకరాలు)  మించగూడదన్నమాట.

>>  ఇక ఈ పరమాద్భుతమైన ఈ పథకం ద్వారా ఈ రెండెకరాల రైతన్నకు ఒరిగేది ఏమిటంటే. “ఏడాదికి 6వేలు, అదికూడా ప్రతి నాలుగు నెలలకీ 2వేలు చొప్పున ఇస్తారు”.

PM Kisan2

>> మోడీ ప్రభుత్వం ప్రకారం 2019 -2020 బడ్జెట్ లో ఈ పథకానికి 87 వేల 217 కోట్ల నిధులు కేటాయించారు. సుమారు 14.5 కోట్ల రైతులు లబ్దిపొందుతారు.

…. సరే, ఈ పథకాన్ని కొంత లోతుగా ఆలోచిస్తే,

 • దీనివల్ల రైతుకి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది ?
 • వీరిచ్చే 6వేల ద్వారా  రైతుకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ?
 • రెండు హెక్టార్లు(సుమారు ఐదెకరాలు) ఉన్న రైతులు ఏ విధమైనటువంటి పంటలను పండిస్తున్నారు ?
 • ఏ విధంగా ఈ రెండు హెక్టార్లు(సుమారు ఐదెకరాలు) రైతులు దేశ ఆహార భద్రతలో భాగస్వాములు అవుతున్నారు? ….. ఈ దేశంలో రైతులు అంటే కేవలం రెండు హెక్టార్లు(సుమారు ఐదెకరాలు)ఉన్నవారేనా ? 

రైతులకు పెట్టుబడి సాయం అంటూ ఏడాదికి సుమారు 90వేల కోట్ల ధనాన్ని వెచ్చిస్తూ  ఈ ప్రభుత్వం ఏమి సాధించాలనుకొంటూంది ??

అసలు రైతు సమస్యలు ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలుసునా ???

ఈ దేశంలో రైతులు అంటే కేవలం రెండు హెక్టార్లు(సుమారు ఐదెకరాలు) ఉన్న వారే కాదు. అసలు రైతులు ప్రభుత్వాలు ఇచ్చే పప్పూ బెల్లాలకు ఆశపడరు.

 • రైతులకు కావాల్సింది “కనీస మద్దతు ధర”.
 • పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు.
 • నానాటికీ లెక్కకుమిక్కిలిగా వస్తున్న చీడపీడల నివారణకు అవసరమైన మందులు, పంట దిగుబడికి వాడే ఎరువులు తదితరాల రేట్లు  ఆకాశాన్నంటాయి.
 • దేశ ఆహారభద్రతను కాపాడేది కేవలం ఈ రెండెకరాల ఆసాములు కాదు – మీరిచ్చే ఈ 6వేల పప్పూ బెల్లాలు అసలే కాదు.
 • పంటపండించడానికి అవసరమైన మౌలికసదుపాయాల కల్పించండి.
 • రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొంటూ నీటిసదుపాయాన్ని విస్తృతపరచండి.
 • ఆధునిక వ్యవసాయ పద్ధతులకోసం ఇస్తున్న సబ్సీడీని మరింతగా విస్తృతపరచండి.
 • ఎరువులు తదితరములైన రసాయనిక మందులపై ఇస్తున్న సబ్సీడీలను మరింత పెంచండి
 • బ్యాంకు రుణాలను సరళతరం చేయండి.
 • కౌలురైతులకు ప్రత్యేక రక్షణలు చేపట్టండి. 
 • ఎన్ని ఎకరాలు అన్న అంశంతో సంబంధం లేకుండా పంట పండిస్తున్న ప్రతివారికీ ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకు రండి
 • అతి ముఖ్యమైన  “మద్దతు ధర – మార్కెటింగ్ సదుపాయాలు” ఇవన్నీ ప్రభుత్వం రేగులేట్ చేసేలా విధానాలు రూపొందించండి.
 • పండించిన పంటను అమ్ముకోలేని దౌర్భాగ్యస్థితిలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటూ ఉంటే, మీరేమో రెండెకరాల లోపు ఉన్న రైతులకు 12వేలు పప్పూ బెల్లాలను పంచిపెట్టి, వేలకోట్ల ప్రజాధనాన్ని అర్థంలేకుండా ఖర్చుసేసి, దాన్నిమించిన పబ్లిసిటీ చేసుకొంటున్నారు . – ఇది పూర్తిగా అర్థంలేని వ్యవహారం.
 • ఇవన్నీ ఇబ్బందికరం అనుకొంటే,  వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరణ చేసి, భూ యజమానులను  ఆ లాభాల్లో భాగస్వామ్యం చేయండి. ఈ రకంగా పెట్టుబడి మొత్తం కార్పొరేట్లు పెట్టుకొంటారు – భూమి ఉన్న యజమానులకు ఆ భూమిలో పాండే పంటలాభాల్లో భాగం వస్తుంది – దీనివల్ల రైతన్నలకు నానాబాధలు తప్పుతాయి.
 • వాగాడంబరాలు మాని చిత్తశుద్ధితో రైతులకు తోడ్పాటునివ్వండి.
 • .
  SUPPORT FARMERS – SAVE AGRICULTURE – PROTECT FUTURE.
 • Save farmers
ప్రకటనలు

6 thoughts on “రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

 1. @Thirumal Prasad Patil:

  ” కానీ ఎన్నెకరాలకు ఇస్తామని రాయలేదు. 6 వేలు ఇస్తామని మాత్రమే చెప్పారు”

  I think it is a lumpsum amount i.e. Rs. 6,000 per family per year irrespective of land holding size.

  Your heading “ఫలితం మూరెడు – ప్రచారం బారెడు” is very appropriate.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. “కుటుంబసభ్యులందరిపేరిటా ఉన్న భూమి మొత్తం కలిపినా రెండెకరాలకు మించగూడదన్నమాట”

  ప్రసాద్ గారూ, నాకు తెలిసినంత మేరకు ఈ పరిమితి రెండు హెక్టేర్లు అనగా అయిదు ఎకరాలు (1 ha = approx. 2.5 acres). అందువలన రైతులలో సింహభాగం కవరేజీ ఉంటుంది.

  లోక్సభ ఎన్నికల దరిమిలా ఈ పరిమితి పూర్తిగా ఎత్తేసే యోచన ఉందని విన్నాను, ఎంతవరకు వాస్తవమో తెలీదు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. అవునండీ – మళ్ళీ వెరిఫై చేశాను.. 2 హెక్టర్లు – దాదాపు ఐదెకరాలు.. – Thanks for the correction. 🙂 – కానీ ఎన్నెకరాలకు ఇస్తామని రాయలేదు. 6 వేలు ఇస్తామని మాత్రమే చెప్పారు

   మెచ్చుకోండి

 3. మీరు చెప్పినట్లు 2 ఎకరాల నిబంధన లేదు.. 2 ఏకరాలకు రూ.12 వేలు ఇస్తారని మీరు చెప్పారు కానీ ఎన్ని ఎకరాలు ఉన్నా ఏడాదికి రూ.6వేలే ఇస్తారు..

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s