|:| చాళుక్యుల అద్భుత నిర్మాణం “కమలీశ్వర ఆలయం” | జలసంఘ్వి, కర్ణాటక |:|

// కమలీశ్వర ఆలయం – జలసంఘ్వి (జల సంఘవి) – చాళుక్యుల నిర్మాణం //
.
.DSCN4685 - Copy.JPG
.
>> “జలసంఘ్వి” – ఒక అతి చిన్న గ్రామం. కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, హోమ్నాబాద్ మండల పరిధిలోని ఈ గ్రామం “బీదర్ – గుల్బర్గా హైవే” లో హోమ్నాబాద్ కు పది కిలోమీటర్ల ముందుగా వస్తుంది. బీదర్ నుండి షుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
.

.
>>ఈ ఊరు, నాటి “కళ్యాణీ చాళుక్యుల రాజధాని” అయిన నేటి కర్ణాటక లోని “బసవకళ్యాణ” కు షుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కళ్యాణి చాళుక్యుల పాలనాకాలంలో ఈ ప్రదేశం ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఈ ఊర్లో, రోడ్డును ఆనుకొనే ఉన్న చాళుక్యులు నిర్మించిన పురాతనమైన “కమలీశ్వర ఆలయం” ఖచ్చితంగా చూడదగిన నిర్మాణం.
.
>> పూర్తిగా శిథిలమైన ఈ ఆలయాన్ని 2012 లో పునర్నిర్మించారు. అయితే సరైన నిర్మాణ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఈ పురాతన ఆలయం కొంత జీవం కోల్పోయినట్లుగా కనిపించినా, అత్యద్భుతమయిన శిల్పకళ మాత్రం అచ్చెరువొందేలా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది.
.
>> ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1100 కాలంలో కళ్యాణీ చాళుక్యుల పాలనలో “6వ విక్రమాదిత్యుడు” నిర్మించాడని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని “వేసర శైలి” లో నిర్మించారు.
.
>> చిన్నదైన ఈ ఆలయం ఒక దీర్ఘ చతురస్ర నిర్మాణం. ఈ ఆలయ ప్రవేశంలో ఎటువంటి చుట్టూగోడలూ లేని ముఖమండపం, దానిని ఆనుకొని చిన్న అంతరాళం, తదుపరి గర్భాలయం నిర్మించారు. గర్భాలయపు ద్వారంపై అద్భుతమైన శిల్పకళను గమనించవచ్చు. గర్భాలయంలో శివలింగం కనిపిస్తుంది.
.

.
>> మూడువైపులా నిర్మించిన గోడలకు బయటివైపున మలచిన శిల్పాలు జీవకళ ఉట్టిపడేలా ఉంటాయి. పలు భావాలను ఒలికిస్తూ, రకరకాల అలంకరణలతో, వస్త్రధారణలతో, భంగిమలతో, మధ్యయుగపు జీవన శైలిని ప్రతిబింభించేలా అత్యద్భుతంగా మలచబడ్డాయి. అలాగే ఎన్నో దేవతల అద్భుత శిల్పాలు కూడా మలచబడ్డాయి.
.
>> తదుపరి కాలాల్లో పాలించిన “హొయసల” వారి నిర్మాణాలకు స్పూర్తి ఈ ఆలయ శిల్పకళే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.. ప్రత్యేకించి కర్ణాటక లోని “బేలూరు – హళీబేడు – తదితర” ఆలయాల శిల్పకళకు మూలం ఈ శిల్పకళే. అలాగే మన “కాకతీయుల – రామప్ప ఆలయం” లో మనకు కనిపించే “సాలభంజికలు – మదనికలు” లాంటి అపురూప శిల్పాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. బహుశా ఈ ఆలయ నిర్మాణాల స్పూర్తితోనే తదనంతర కాలంలోని శిల్పులు మన కాకతీయ ఆలయాలకు కూడా జీవం పోశారని చెప్పవచ్చు. (ఉదాహరణకు వస్త్రాన్ని లాగుతున్న కోతిని అదిలిస్తున్న ఒక యువతి శిల్పం లాంటివి ఎన్నో ఉన్నాయి)

.
>> ఈ ఆలయంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ శిల్పం ** “శాసన సుందరి” ** చేతిలో శాసన పత్రంపై వ్రాస్తున్నట్లుగా మలచారు. ఎడమచేతిలో ఉన్న ఆ శాసన పత్రంలో కన్నడ అక్షరాలు ఉండడం ఆసక్తికరం. ఇలాంటి శిల్పం మనదేశంలో ఏ ఆలయాల్లోనూ ఉన్నట్లు కనిపించదు. ఇదొక అద్వితీయమైన శిల్పమని చెప్పవచ్చు.
.DSCN4670.JPG
.

>> చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఆ యువతి చేతిలో ఉన్న “శాసన పత్రం” లో ఇలా పేర్కొన్నారు.
.
***** “” సప్తద్వీపోదరి భూతం భూతం స్వీకరిష్యతి చాళుక్యో విక్రమాదిత్యః” ; సప్తమో విష్ణువర్ధనః “”*****

….. అంటే ** // ఏడు ద్వీపాలు గల ఈ ప్రాంతాన్ని చాళుక్య వంశ పాలకుడు – ఏడవ విష్ణువర్ధనుడు అయిన విక్రమాదిత్యుడు జయించి పాలిస్తున్నాడు // ** అని అర్థం.
.DSCN4670 - Copy.JPG
.

>> ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. అక్కడ ఊరి ప్రజలను వాకబు చేస్తే, ప్రభుత్వం వారు ఈ ఆలయాన్ని అభివృద్ధిచేయబోతున్నారని, పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నారనీ చెప్పారు.
.
>> అధ్యయనం చేయాలనుకొనేవాళ్ళకు ఇదొక తరగని గని. ఖచ్చితంగా దర్శించవలసిన ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని ఫోటోలు మీకోసం… ఆస్వాదించండి..
.

18 thoughts on “|:| చాళుక్యుల అద్భుత నిర్మాణం “కమలీశ్వర ఆలయం” | జలసంఘ్వి, కర్ణాటక |:|

 1. చాలా బాగుంది పాలకుల్లో మార్పు వస్తేనే సాధ్యమవుతుంది అత్యత్భుతమైన విలువైన సంపదను పరిరక్షించుకోవాలి అన్న తపనతో ప్రయత్నిస్తే భవితరాలకు అందించగలము.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో – హొయసల, బాదామి చాళుక్య, సాళ్వ – ఈ రాజ వంశాల పేర్లు చదివినప్పుడు ఏదొ తెలియని ఫాసినేషన్. మీ ఈ వ్యాసం వల్ల నా “నేను ఎప్పటికైనా – చూడగలిగితే” విష్ లిస్ట్ కి జలసంఘ్వి చేర్చబడింది. థాంక్స్ ఫర్ పోస్టింగ్.
  ~ లలిత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. తిరుమల్ గారు ఇందులో ఉన్న శిల్పాలు రామప్ప గుడిలోని మదనికలకు చాలా దగ్గరగా ఉన్నవి ఆలయ నిర్మాణం కూడ అదే విధంగా అనిపిస్తుంది. మీరు తీసిన ఫొటొలు కూడా చాలా బాగా ఉన్నవి. మన గొప్పతనం ఎమిటొ మనకే తెలియకుండ బ్రతుకుతున్నాం కళ్ళ ముందు అంతరిస్తున్న మన సంస్కౄతి, జీవన శైలిని ఫొటొల రూపంలొ ఐన చుపిస్తూ రేపు మా పిల్లలకు చెప్పుకోవడానికి మీ లాంటి వాళ్ళు ఇలా రాస్తుండాలి అని కొరుకుంటున్నాను

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. అవునండీ. కాకతీయుల శిల్పులు హోలసలుల శైలిని అనుసరించారు.. హోలసలులు చాళక్యుల శైలిని స్వీకరించారు. అందుకే మనకు ఆ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి.. మన పురాతన సంపదను ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇప్పటికే చాలా నాశనమై పోయింది.

   మెచ్చుకోండి

 4. ఎంతో శ్రమకోర్చి చెక్కిన శిల్పాలు ఇలా పాడుబడిపోతున్నాయి….లేనిదానికోసం ఆరాటపడిపోయే బదులు ఉన్నవాటినైనా కాపాడుకుంటే మేలు కదా ? ఆలయాలను పరిరక్షించుకుందాం అనే నాయకుడు ఒక్కరూ లేరు. విదేశాలలో బ్రతుకు తెరువు కోసం ఆలోచించనక్కరలేదు కాబట్టి ఎంజాయ్‌మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు.మన దగ్గర పూట గడవడమెలా అన్నదే ఆలోచించుకుంటూ ఉంటే ఆలయాల గురించి ఆలోచించేదెవరు ? ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుంటే అదే పదివేలు !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s