అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

// అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం //
.
….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. !

>> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు.
.
>> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!!
.
>> ప్రభుత్వం సేకరించామని చెబుతున్న 33వేల ఎకరాల భూములను “మంగళగిరి”, “తుళ్ళూరు” & “తాడేపల్లి” మండలాల పరిధిలోని షుమారు 25 గ్రామాలనుండి సేకరించారు.
.
… ఆ గ్రామాల వివరాలు ఇక్కడ చూడండి.
.LPS-1LPS-2
…… మరి సేకరించిన ఈ 25 గ్రామాల్లో ఎన్ని గ్రామాలవాళ్ళకు “ప్లాట్లు కేటాయించారో” తెలుసా ???
.
>> గతనెల 25-జూన్-2016 వ తేదీన లాటరీ తీసి ఆర్భాటంగా సి‌ఆర్‌డి‌ఏ వాళ్ళు విడుదల చేసిన జాబితాలో కేవలం “తుళ్ళూరు” మండలానికి చెందిన “నేలపాడు” గ్రామానికి సంబంధించిన ప్లాట్లను మాత్రమే కేటాయించారు. వీటిలో “1147 నివాస ప్లాట్లనూ” & “769 వాణిజ్య ప్లాట్లనూ” అదికూడా “తాత్కాలిక కేటాయింపు” అన్నపేరుతో ప్రకటించారు.
.
>> అంటే, 25 గ్రామాలకు గాను, కేవలం “ఒకేఒక్కగ్రామానికి మాత్రమే ప్లాట్లు కేటాయించడం జరిగింది”. అదికూడా “తాత్కాలిక కేటాయింపు” అన్న నిబంధనతో. !
.
కేవలం “నేలపాడు” గ్రామానికి మాత్రమే ప్లాట్లు కేటాయించారు. మిగతా గ్రామాలకు ఇంకా కేటాయింపులు జరపలేదు
.Plots-2.jpg

>> ఇక ఈ కేటాయింపు కూడా “తాత్కాలికం” అని పేర్కొనడమే కాకుండా, మరిన్ని మోసపూరితమైన అంశాలను చేర్చారు.
.
….. ఈ తాత్కాలిక కేటాయింపు అన్నది
.
=> ఎటువంటి యాజమాన్య హక్కునూ దాఖలు పరచదు
=> యాజమాన్య హక్కులు నిర్ణయించే సాక్ష్యము కాదు.
=> రిజిస్ట్రేషన్ చేసుకొనే వీలులేదు
=> అమ్ముకొనే వీలులేదు
=> బదలాయించే వీలులేదు
=> ఆస్తిపై ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకొనే వీలులేదు
=> ఆస్తిపై లావాదేవీలు చేయడానికి వీలులేదు
=> రుణాలు పొందే అవకాశం లేదు
.
>> ఇన్ని నిబంధనల మధ్య ఈ ప్లాట్లు కేటాయించినా, ఇవికూడా “తాత్కాలికమే”.. నమ్మకం లేదా, మీరే చూడండి..!! 

.
>> ఈ కేటాయింపు పత్రాల్లో కూడా, “తుది యాజమాన్య ధ్రువపత్రాలు” “నిబంధనలను అనుసరించి” మంజూరు చేయబడును అని పేర్కొన్నారు..
.
…. ఇక్కడ “నిబంధనలు” అంటే ఏమిటి ??
.
>> ఇక్కడే “అసలు తిరకాసు” ఉంది. అసలు ఈ 33వేల ఎకరా భూములు ఏవైతే ప్రభుత్వం వారు పేర్కొంటున్నారో, “వీటిలో ఒక్క ఎకరం కూడా ఇంతవరకూ ప్రభుత్వానికి స్వాధీనం కాలేదు”. నేను మీతో జోక్ చేయడం లేదు.. ఇది వాస్తవం..
.
>> “ల్యాండ్ పూలింగ్” పేరుతో లాక్కొన్న ఈ భూములు ప్రభుత్వానికి స్వాధీనం కావాలంటే, “ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం” “ఫారం-9.14” ప్రకారం అగ్రిమెంట్ చేసుకోవాలి. ఈ ఫారం 9.14 అనేది “Agreement between Competent Authority and the Landowner” అన్నమాట.. ఇంతవరకూ ఒక్క రైతుదగ్గర కూడా ఈ “ఫారం9.14” ను ప్రభుత్వం వారు తీసుకోలేదు అనడానికి సాక్ష్యం, సి‌ఆర్‌డి‌ఏ వెబ్సైట్ లొ ఎక్కడా వాటి వివరాలు లేవు. ఈ అంశంపై గత ఏడాది 30-డిసెంబర్-2015 వ తేదీన నేనుక వివరమైన వీడియో పెట్టాను చూడండి. మరింత అవగాహన కలుగుతుంది.
.
ఆ వీడియో ఇదే.
https://www.facebook.com/thirumalprasad.patil/videos/1100539443312795/
.
.
>> కాబట్టి, ఈ “తాత్కాలిక కేటాయింపు” అన్న పేరుతో వీరు కేటాయించిన ఈ ప్లాట్లకు “తుది యాజమాన్య ధ్రువపత్రాలు” “నిబంధనలను అనుసరించి” మంజూరు చేయబడును అంటే దానర్థం, భూయజమానులకూ & ప్రభుత్వానికీ మధ్య “ఫారం 9.14” ద్వారా ఫార్మల్ అగ్రీమెంట్ “Agreement between Competent Authority and the Landowner” చేసుకోవడమే కాకుండా, “ఫారం 9.23” ద్వారా భూములను ప్రభుత్వ ఆధీనంలోనికి తెచ్చుకొని, “ఫారం 9.27” ద్వారా ప్రభుత్వం వారికి రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
.
….. అంటే, ఈ తతంగమంతా అయ్యాక మాత్రమే, “తుది యాజమాన్య ధ్రువపత్రాలు” అందజేస్తారన్నమాట….

 >> 25 గ్రామాలకు సంబంధించిన ఈ తతంగమంతా ఎన్నటికి పూర్తయ్యేను ? వీళ్ళకు ప్లాట్లు ఎప్పుడు వచ్చేను ?
.
>> ప్రస్తుతం భూములిచ్చిన వాళ్ళకు (అదికూడా కేవలం ఒక్క గ్రామానికే) కేటాయించిన ఈ ప్లాట్లన్నీ నాలుక గీసుకోవడానిక్కూడా పనికిరావు.. ఎందుకంటే, అసలు “యాజమాన్య హక్కును కూడా ఇవ్వడం లేదని” వీరిచ్చిన ఈ తాత్కాలిక కేటాయింపు పత్రాల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు మరి.
.
>> చంద్రబాబుగారేమో, భూములిచ్చినవాళ్ళందరూ కోటీశ్వరులై విమానాలెక్కి తిరుగుతున్నారని ప్రచారం చేసుకొంటున్నారు… నమ్మకం లేదా, ఇదిగో టి‌డి‌పి వారి అధికారిక ఫేస్బుక్ పేజ్ లోని ఈపోస్ట్ ను మీరే చూడండి..
.13781766_1374753812541393_2752189433288679302_n
.
>> ప్రజలను ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవపట్టించి, మోసం చేస్తున్న పాలకులను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇదీ స్వతంత్ర భారతావనిలో ప్రజల పరిస్థితి.
.
… ఏంచేస్తాం, ప్రజల్లో చైతన్యం లేదు.. అపరిమిత అధికారముందని భావిస్తున్న పాలకులు ప్రజలతో ఏవిధంగానైనా ఆటలాడుకోవచ్చునని తీర్మానించేశాయి.
.
=> ఈ పద్ధతి మారాలి..
=> ప్రజాలో చైతన్యం రావాలి..
=> ప్రభుత్వాల దమననీతిని ప్రశ్నించాలి
=> అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలను ఎండగట్టాలి
.
// జైహింద్ //
.

35 thoughts on “అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

  1. @Abbas – You too can do the same what you suggested Thirumal. You too have the same resources as he does.Provided you have that same love and affection towards your land of birth. Hopefully you do. Thirumal has his own priorities, Let him enlighten the society. How can you dictate terms to othes ? What stops you to do what you suggested?? Some people are very well versed with social work, some are good at bringing the awareness. Thirumal is good in his field, what brings you so much in-tolerance towards him??

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. You know what Thirumal., I pleaded you to come back and myself told you should focus on your priorities rather on my prayers. But my silent prayers are you should come back.. Becaues what you speak reflects truth nothing but truth rather than Organic hate. Hopefully god heard my voice. We all want you to be among us. Keep us enlightened. Keep writing what you believe in. Let true spirit of democracy may be lightened all the time. Great going buddy..!!!

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  3. ప్రసాద్ గారు…
    భూ సమీకరణ అనేది మంచి ఆలోచన…
    భూసేకరణ కంటే నిర్వాసితులకు ఎన్నో రెట్లు ప్రయోజనకరం గా ఉంటుంది..
    ఇక మీరు చెప్పిన 9.14 విషయానికి వస్తే, ఇందులో మోసం ఏమి ఏమి లేదు..
    9.3 అప్లికేషను ద్వారా భూసమీకరణ కు సమ్మతించిన పట్టదారుల నుంచి CRDA కు రిజిస్ట్రేషన్ ఐన వెంటనే, 9.14 ద్వారా ఇచ్చిన పత్రాలను శాశ్వత భూ యాజమాన్య పత్రాలుగా మార్చుతారు..
    భూ సమీకరణ లో ప్రతి పట్టాదారు కి, తన వ్యవసాయ భూమి కి బదులు గా, అభివృద్ధి పరిచిన ఇంటి స్థలం మరియు వాణిజ్య స్థలాన్ని ఇవ్వడమే ప్రధాన మౌళికాంశం..
    ఇక ఈ ఇంటి తాత్కాలిక ధృవపత్రం ఎందుకంటే….పట్టదారులకు నమ్మకం కలిగించడానికి…
    సదరు పట్టదారులు CRDA కి రిజిస్ట్రేషన్ చేయునపుడు, ఇవే స్థలాలకు శాశ్వత భూ యాజమాన్య పత్రాలు మార్చవచ్చును…
    దయచేసి అర్థ సత్యాలు ప్రచురించడం భూసమీకరణ పట్టదారులకు మరింత గందరగోళం కలిగించును…..
    ఇది నా భూసమీకరణ పై నా పరిజ్ఞానం మేరకు వ్రాసాను…

    బాలకిషన్…

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  4. తిరుమల్ గారు! చాలా మంది మనసులో అనుకునేవి – డైనింగ్ టేబుల్స్ దగ్గర మాట్లాడుకునేవి – మీరు బ్లాగ్ లో రాస్తున్నారు. That shows you still have the sensitivity to the happenings around you and the zeal to call them out. Keep it up!

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  5. Mr Patil (July 30 at 2:49 pm), వారు చెబుతున్నదానికి (అంటే ప్రజలు తమంతట తామే పరిష్కరించుకోగల సమస్యలకి) ఒకటి రెండు ఉదాహరణలివ్వండని నేనే అబ్బాస్‌గారిని అడుగుదామనుకున్నాను, ఈలోగా మీరు వారికిచ్చిన జవాబు వచ్చేసింది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

    1. అదేకాదా అండీ, నేనేమి చేయాలో వాళ్ళు చెప్పడమేమిటో అర్థం కాదు..ఆపనేదో వాళ్ళే చేస్తే అయిపోతుంది.. ఎవరి పరిధిలో వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు.. ఏమిటో వీళ్ళ అసహనం..

      మెచ్చుకోండి

    2. ప్రసాద్ అన్న మీరు ఇంత కష్టపడి రాస్తూ ఉన్నారు….మాలాంటి వందలాది మంది చదువుతున్నారు …కాని ఇది చేరాల్సిన వాళ్ళకి చేరుతుందా లేదా అనేది అనుమానం …అంటే జగన్ గారికి

      మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  6. మంచి వ్యాసమే వ్రాశారు. “ప్రజల్లో చైతన్యం లేదు”, “ప్రజాలో చైతన్యం రావాలి” అని చివర్లో వ్రాశారు బాగుంది. మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను కానీ ప్రజల చైతన్యాన్ని ఎలా అణగదొక్కుతున్నారో మీ క్రితం టపా “రాజ్యం రక్తం కోరుతోందా?” లో అన్నారు. మరి చూస్తున్నారుగా ప్రభుత్వాల అసహనం, దమననీతీ. బ్రిటిష్ వాడు వలస పాలకుడు కాబట్టి అలా చేసాడంటే అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? అయినా వాట్ ప్రజాస్వామ్యం? ఇప్పుడు విస్తరించున్నదల్లా ఏకైక లక్ష్యంగా అధికార కాంక్ష, పెరిగిపోతున్న అసహన వైఖరి, కమ్మేసిన వ్యాపార సంస్కృతి (అదే – సోకాల్డ్ కార్పొరేట్ సంస్కృతి; ఇది వేషం మార్చుకున్న వలసపాలన), ఆ బడా వ్యాపారులకి దాసోహమంటున్న ప్రభుత్వాలు, నాయకులు. ఇంక ప్రశ్నించడానికి తావెక్కడుంది, ప్రశ్నించినా అణగదొక్కకుండా వినిపించుకునేవారెవరు? విలువలు వదిలేసిన సూడో ప్రజాస్వామ్యంలో పడి కొట్టుకుంటున్నాం.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

    1. మీరు చెప్పినవి అక్షర సత్యాలు నరసింహా రావు గారూ. ప్రజాస్వామ్యం పేరిట నడుస్తున్న రాచరికమే ఇది.. అధికార దుర్వినియోగం మితిమీరి పోయింది. బరితెగింపు పరాకాష్టకు చేరుకొన్నది.

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి